శ్రీవారికి కానుకగా 46 రకాల స్వర్ణాభరణాలు.. జాబితాలో ఏమున్నాయంటే?
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:38 PM
తిరుమల వేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన దాత వర్థమాన్ జైన్ 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన విషయం తెలిసిందే. శ్రీవారికి 106 కిలోల బంగారంతో ఆభరణాలు చేయించగా.. శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రాన్ని వర్థమాన్ జైన్ దంపతులు కానుకగా అందించారు.
తిరుమల, నవంబర్ 26: తిరుమల వేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన దాత వర్థమాన్ జైన్ 121 కేజీల బంగారు ఆభరణాలను సమర్పించిన విషయం తెలిసిందే. ఈరోజు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీవారికి వర్థమాన్ జైన్ దంపతులు బంగారు ఆభరణాలను అందించారు. దాదాపు రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల స్వర్ణ ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చేయించి కానుకగా అందించారు. శ్రీవారికి 106 కిలోల బంగారంతో ఆభరణాలు చేయించగా.. శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రాన్ని వర్థమాన్ జైన్ దంపతులు కానుకగా సమర్పించారు.

46 రకాల స్వర్ణ ఆభరణాలు ఇవే..
బంగారు పాద కవచములు -3
బంగారు అందెలు -3
బంగారు పాకడాలు
బంగారు తులసిపాత్ర హారం
బంగారు అష్టోత్తర కాసుల మాల
బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
బంగారు పులిగోరు
బంగారు అశ్వథ పాత్ర హారము
బంగారు సాదా వడ్డాణము
బంగారు గంటల మొలతాడు
బంగారు సూర్యకటారి
బంగారు కౌస్తుభం
బంగారు శ్రీవత్సం
బంగారు మోచేయి
బంగారు కటి హస్తం
బంగారు నాగాభరణ వడ్డాణము
బంగారు గోపు
బంగారు ఐదు పేటల కంఠీలు 5
బంగారు చంద్రవంకీ కంఠీ
బంగారు వైకుంఠ హస్తం
బంగారు నాగాభరణ కడియాలు 4
బంగారు భుజ కీర్తులు 3
బంగారు కర్ణపత్రములు 3
బంగారు భావళీలు -3
బంగారు సాలిగ్రామ హారములు- 3
బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3
బంగారు మోపుగల యజ్ఞోపవీతం
బంగారు శంఖ కవచము
బంగారు చక్ర కవచము
బంగారు కిటీపు ముఖపట్టి
బంగారు కిరీటము
2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు



ఇవి కూడా చదవండి...
తిరుమల శ్రీవారికి భక్తుడు వర్థమాన్ జైన్ భారీ విరాళం
ఏపీ ఎన్నికలపై నిఘా.. 15,100 కెమెరాలతో పోలింగ్ కేంద్రాల లైవ్ స్ట్రీమింగ్: ఎస్‌ఈసీ
Read Latest AP News And Telugu News