Share News

ఏపీ ఎన్నికలపై నిఘా.. 15,100 కెమెరాలతో పోలింగ్ కేంద్రాల లైవ్ స్ట్రీమింగ్: ఎస్‌ఈసీ

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:10 PM

ఏపీవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

ఏపీ ఎన్నికలపై నిఘా.. 15,100 కెమెరాలతో పోలింగ్ కేంద్రాల లైవ్ స్ట్రీమింగ్: ఎస్‌ఈసీ
AP Election Monitoring

విజయవాడ, నవంబర్ 26: రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయ ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రం నుంచి లైవ్ స్ట్రీమింగ్‌ను ఎస్‌ఈసీ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు విస్తృత స్థాయిలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 15,100కు పైగా కెమెరాలతో పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో సుమారు 5,600 కెమెరాలతో పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సుమారు 9,500 గ్రామ పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియ పరిశీల జరిగిందన్నారు.


పోలింగ్ కేంద్రాల్లోని కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు రికార్డింగ్ కూడా నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ అన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే గుర్తించి కలెక్టర్లు, ఎస్పీల ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి కేంద్రంలోని పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తామని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

‎తిరుమల శ్రీవారికి భక్తుడు వర్థమాన్‌ జైన్ భారీ విరాళం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 03:19 PM