తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:22 PM
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమలలో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది.
తిరుమల: తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమల(Tirumala)లో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది. రెండడుగుల పొడవు మాత్రమే ఉన్న ఈ పాము సాధారణ నాగుపాముల తరహాలోనే పడగతో కనిపించగా అక్కడి సిబ్బంది పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కరనాయుడికి సమాచారమిచ్చారు.
వెంటనే ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని దట్టమైన అడవిలో విడిచిపెట్టాడు. ఈ అరుదైన పాము నాగుపాము జాతికి సంబంధించినదేనని, అత్యంత విషపూరితమైనదని భాస్కర నాయుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్ రికార్డ్
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు
Read Latest Telangana News and National News