Share News

మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర స్మగ్లర్స్ అరెస్ట్

ABN , Publish Date - Aug 28 , 2026 | 07:47 PM

శేషాచల అడవులలో ఎర్రచందనం అక్రమ రవాణాపై RSASTF అధికారులు ఉక్కుపాదం మోపారు. 44 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర స్మగ్లర్స్‌ను అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర స్మగ్లర్స్ అరెస్ట్
Red Sanders Smuggling

తిరుపతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై RSASTF అధికారులు ఉక్కుపాదం మోపారు. 44 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర స్మగ్లర్స్‌ను అధికారులు ఈరోజు (శుక్రవారం) అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వద్ద టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, అటవీ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్స్‌ ఎం. తంజి, సెల్వంలను అరెస్ట్ చేశారు.


నిందితుల దగ్గరి నుంచి 7 ఎర్రచందనం దుంగలు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తంజిపై 44కు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బెంగళూరు, చెన్నై స్మగ్లర్లతో సంబంధాలపై ఈ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ బృందాన్ని హెడ్ ఎల్. సుబ్బారాయుడు అభినందించారు. ఈ స్మగ్లర్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ

నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 08:56 PM