Share News

తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:42 AM

తిరుపతి నగరంలోని జీవకోన ప్రాంతంలో ఓ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జీవకోన అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ దాడి జరిగింది.

తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి
Tirupati Girl Attack

తిరుపతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలోని జీవకోన ప్రాంతంలో ఓ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జీవకోన అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ దాడి జరిగింది. జీవకోనలో నివాసం ఉంటున్న మైనర్ బాలికపై కొందరు యువకులు బ్లేడ్లతో దాడికి పాల్పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలికను రక్షించారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


జీవకోనలో రద్దీగా ఉండే ప్రాంతంలోనే మైనర్ బాలికపై దాడి జరగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బహిరంగ ప్రదేశంలో బ్లేడ్లతో దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. బాలికపై దాడికి కారణాలు ఏమిటి?, దాడికి పాల్పడిన వారు ఎవరు? అనే అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మైనర్ బాలికపై దాడి జరగడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం కొత్త శకంలోకి: పవన్ కల్యాణ్

అల్పపీడన ప్రభావం.. ఏపీలో వర్షాలు

వెలిగొండ ప్రాజెక్ట్.. ఆఖరి లబ్ధిదారుడి వరకూ పరిహారం అందిస్తాం: మంత్రి డీజీవీ స్వామి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 07:46 AM