తగ్గిన మామిడి ధరలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:25 PM
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి మామిడి ఎగుమతులు పదిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి.
రైల్వేకోడూరు(తిరుపతి): రైల్వేకోడూరు నుంచి మామిడి ఎగుమతులు పదిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి. రుమాణి, పులిహోరా కాయలను పచ్చళ్ల కోసం రైల్వేకోడూరు వ్యాపారులు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్, బిల్వాడలకు పంపిస్తున్నారు. పచ్చళ్ల సీజన్ ప్రారంభంలో రుమా ణి రకం మామిడి కాయలు టన్ను రూ. 45వేలు, పులిహోర మామిడి కాయలు రూ. 40వేలు, తోతాపూరి మామిడి రకం కాయలు రూ. 25వేలు పలికాయి.
అయితే రాజస్థాన్‌లో స్థానికంగా మామిడి కాయలు మార్కెట్‌కు వచ్చిపడడంతో రైల్వేకోడూరు మామిడి కాయలకు డిమాండ్ తగ్గింది. మూడురోజులుగా రుమాణి రకం మామిడి టన్ను రూ. 18వేలు, పులిహోర రకం రూ. 18వేలకు పడిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం
అమరావతి పనులకు వేగంగ ఇసుక, కంకర
Read Latest Telangana News and National News