Share News

భలే బురిడీ కొట్టించిందిగా.. ఈ పొట్టేలు తెలివికి నెటిజన్లు షాక్! వీడియో వైరల్

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:24 AM

సాధారణంగా గొర్రెలు, పొట్టేళ్లు అంటే అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్ అనుకుంటాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిందే.

భలే బురిడీ కొట్టించిందిగా.. ఈ పొట్టేలు తెలివికి నెటిజన్లు షాక్! వీడియో వైరల్
Sheep Fight Viral

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా గొర్రెలు, పొట్టేళ్లు అంటే అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్ అనుకుంటాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిందే. రెండు పొట్టేళ్ల మధ్య జరిగిన ఒక వింత సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


వైరల్ అవుతున్న వీడియోలో రెండు పొట్టేళ్లు ఇనుప గ్రిల్స్ (జాలీలు) ఉన్న గదుల్లో బంధించి ఉన్నాయి. ఈ క్రమంలో రెండు పొట్టేళ్ల మధ్య ఫైట్ మొదలైంది. ఒకదానికొకటి తమ ముందు ఉన్న జాలీని లెక్క చేయకుండా కొమ్ములతో ఢీ కొట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. మొదట రెండు పొట్టేళ్లు ఎంతో బలంగా ముందుకు వచ్చి కొమ్ములతో ఢీ కొన్నాయి. చూసేవారు ఈ రెండు పొట్టేళ్లు ఏ రెంజ్‌లో కొట్టుకుంటాయో అని అనుకుంటారు. కానీ, అక్కడ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ పొట్టేళ్లను నిశితంగా గమనిస్తే.. అందులో ఒక పొట్టేలు అత్యంత తెలివిగా ప్రవర్తించింది. అవతలి పొట్టేలు.. పూర్తి బలంతో తలని ఇనుప జాలీని బాదుతుండగా, రెండో పొట్టేలు మాత్రం కేవలం నటనకు పరిమితమైంది. అది తన తలను జాలీ దగ్గరకు తీసుకెళ్లి కొడుతున్నట్లు నటిస్తోందే తప్ప, ఎక్కడా బలప్రదర్శన చేయలేదు. తన భాగస్వామిని రెచ్చగొడుతూ.. అది మాత్రం వేడుక చూస్తోంది. ఇలా ఈ పొట్టేలు తెలివిగా వ్యవహరించి, తన శక్తిని ఆదా చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత అవతలి పొట్టేలు అలసిపోయి సైలెంట్ అయిపోయింది.


ఈ వీడియో @awkwardgoogle అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఓ మై గాడ్.. ఈ పొట్టేలు తెలివి చూస్తే మతిపోతోంది’ అని, ‘గొర్రెల్లో కూడా రాజకీయ గొర్రె ఉంటుందని దీన్ని చూస్తే తెలుస్తోంది’, ‘ ఇది తెలివైన మోసం’ మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..

11 గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

Updated Date - Apr 22 , 2026 | 11:47 AM