కాలేజీ యాజమాన్య వేధింపుల ఘటన.. ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థినుల్లో ఒకరి మృతి!
ABN , Publish Date - Nov 12 , 2026 | 06:27 PM
కాలేజ్ యాజమాన్యం వేధింపుల కారణంగా చిత్తూరు జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
చిత్తూరు, నవంబర్ 12: జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య వేధింపుల కారణంగా ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా.. విద్యార్థి సంఘాలు రోడ్లపై నిరసనలకు దిగాయి.
తిరుపతి జిల్లా శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగా ఇద్దరు విద్యార్థినిలు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
విద్యార్థిని మరణించిందన్న విషయాన్ని కళాశాల యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టిందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై భారీ ఎత్తున నిరసనకు దిగాయి. దీంతో చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
అధిక సంఖ్యలో విద్యార్థులు గూమిగూడడంతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. ఫీజులు చెల్లించలేదంటూ కళాశాల యాజమాన్యం వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందిన విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
నాగుల చవితి ఎప్పుడూ .. ఆ రోజు ఏం చేయాలి
For More TG News And Telugu News