Share News

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:45 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన మరణించారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Ex Minister Satrucharla Vijaya Rama Raju

పార్వతీపురం, నవంబర్12: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన మరణించారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం మన్యం జిల్లాలోని చిన్నమేరంగికి తరలించారు. శుక్రవారం చిన్నమేరంగిలో దహన సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరు సార్లు శాసనసభ్యునిగా, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా, రెండుసార్లు మంత్రిగా, ఓసారి ఎం.ఎల్.సిగా పని చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో శత్రుచర్ల అజాతశత్రువుగా గుర్తింపు పొందారు. శత్రుచర్ల మృతితో ఉత్తరాంధ్రలోని పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి.. ఘనంగా నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

నాగుల చవితి ఎప్పుడూ .. ఆ రోజు ఏం చేయాలి

For More TG News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:20 PM