ఆత్మకూరులో వైసీపీకి షాక్.. 100 కుటుంబాలతో టీడీపీలో చేరిన మాజీ ఎంపీపీ
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:45 PM
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నాయకులు పెద్దసంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
నెల్లూరు జిల్లా, అక్టోబర్ 24: జిల్లాలోని ఆత్మకూరు, చేజర్ల మండలాల్లోని వైసీపీ నాయకులు పెద్దసంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ మాజీ ఎంపీపీ తూమాటి విజయ భాస్కర్ రెడ్డి.. 100 కుటుంబాలతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ భారీ వలసలు వైసీపీని షాక్‌కు గురిచేశాయి.
వైసీపీ నాయకులకు టీడీపీ కండువాలు కప్పి.. దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పూర్తి ఆధిపత్యంతో విజయం సాధిస్తుందన్నారు. గొడ్డలి పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని.. అయినప్పటికీ, ప్రభుత్వం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తున్నామని.. భవిష్యత్తులో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని మంత్రి ఆనం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ.. పార్టీల వారీగా వివరాలివే
Read Latest AP News And Telugu News