Share News

అమెరికాలో ఏపీ వాసి మృతి

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:14 PM

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న మృతిచెందారు. ఆమె తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని గుడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

అమెరికాలో ఏపీ వాసి మృతి
New York Road Accident

ఎన్టీఆర్ జిల్లా, జులై 7 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న మృతిచెందారు. ఆమె తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని గుడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వీరి కారును బలంగా మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రసన్నతో పాటు మరో యువతి ప్రాణాలు కోల్పోయారు.


ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అమెరికాలో జరిగిన ఈ విషాద ఘటన వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. విదేశాల్లో ఉన్న తమ కుమార్తె అనూహ్యంగా మృతి చెందడంతో ప్రసన్న కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రసన్న మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల విదేశాల్లో భారతీయులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎం చంద్రబాబు

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 05:24 PM