ఏపీకి వర్షసూచన.. రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:46 PM
రాబోయే 3 గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
అమరావతి, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు మోస్తారుగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దానితోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
రంపచోడవరం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్లు, వెల్దుర్తి, డోన్, గూటి, పొదిలి, బద్వేలు, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గొట్టిప్రోలు పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
పుంగనూరులో వైసీపీ దాడులపై బోండా ఉమ ఫైర్.. మిథున్ రెడ్డి అరెస్ట్కు డిమాండ్
‘విచారణ పూర్తయ్యే వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలి’.. జగన్ కేసులపై సోమిరెడ్డి
Read Latest AP News And Telugu News