Share News

ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి: మంత్రి వీరాంజనేయస్వామి

ABN , Publish Date - Sep 28 , 2026 | 01:39 PM

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ.. వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. ధర్నాలు చేయడం సమంజసం కాదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తమకు తెలుసంటూ మండిపడ్డారు.

ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి: మంత్రి వీరాంజనేయస్వామి
Minister Veeranjaneya Swamy on employees protest

అమరావతి, సెప్టెంబర్ 28: స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఉద్యోగుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. ధర్నాలు చేయడం, అమానవీయంగా వ్యవహరించడం వెనుక ఉన్న ఏ దుష్టశక్తులు ఉన్నాయో తమకు తెలుసన్నారు. కొందరు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఉద్యోగులకు సూచించారాయన.


విపత్తులు, అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ప్రభుత్వ నిర్ణయాలను, పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరుకున్నారు. ప్రతి నెలా 2వ, 4వ బుధవారాల్లో డైరెక్టర్ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(AAS), వేగవంతమైన క్యాజువల్ లీవ్(CL) మంజూరు విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి

శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Sep 28 , 2026 | 01:49 PM