Share News

‘తుపాన్ల వల్ల నష్టపోయాం.. సాయం అందించండి’.. కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 17 , 2026 | 07:28 PM

వరుస తుపాన్లతో దెబ్బతిన్నామని.. తక్షణ సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆర్థికమంత్రిని కలిసిన సీఎం రాష్ట్ర పరిస్థితి గురించి వివరించి ఆర్థికసాయాన్ని కోరారు.

‘తుపాన్ల వల్ల నష్టపోయాం.. సాయం అందించండి’.. కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు
ap cyclone damage

ఇంటర్నెట్ డెస్క్: ‘అర్నాబ్’, ‘మురసు’.. ఇలా వరుస తుపానులతో రాష్ట్రం భారీగా నష్టపోయిందని.. తక్షణమే ఆర్థికసాయం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రితో భేటీ అయన సీఎం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నిర్మలా సీతారామన్‌కు వివరించారు.


ఈ భేటీలో ‘అర్నాబ్’, ‘మురసు’ తుపానుల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలు, రైతుల పరిస్థితి, హార్టికల్చర్ హబ్, నిధుల విడుదలతో పాటు.. విశాఖ సీఐఐ సదస్సులో కీలక నిర్ణయాలు, పెట్టుబడులు మొదలగు.. అంశాలపై నిర్మలా సీతారామన్‌తో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. అర్నబ్, మురసు తుపాన్ల వల్ల సుమారు రూ. 7000 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని.. పంటలు దెబ్బతినడంతో రైతులు చాలా నష్టపోయారని కేంద్రమంత్రికి సీఎం తెలియజేశారు. తుపాను సమయంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రికి వివరించారు. తుపాను దాటికి తీర ప్రాంతాల్లో మౌలిక వసతులు భారీగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం సాయం అందించవలసిందిగా సీఎం కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 08:11 PM