Share News

మొక్క @ రూపాయి

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:48 PM

ధరలు పెరుగుతుండటంతో టమోటా సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా మండలంలో వేల ఎకరాల్లో టమోటా పంట సాగు చేస్తారు.

మొక్క @ రూపాయి
Tomato Seedling

  • నర్సరీల్లో అందుబాటులో లేని మొక్కలు

  • రెట్టింపైన ధర...ఆందోళనలో అన్నదాతలు

  • టమోటా మొక్కలకు విపరీతమైన డిమాండ్‌

తనకల్లు(అనంతపురం): ధరలు పెరుగుతుండటంతో టమోటా సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా మండలంలో వేల ఎకరాల్లో టమోటా పంట సాగు చేస్తారు. ప్రస్తుతం ఏప్రిల్‌, మే నెలల్లో టమోటా పంట సాగుచేయడానికి రైతులు వేలాది ఎకరాలను సిద్ధం చేసుకున్నారు. వారం రోజుల కిందటి వరకు ధరలు లేకపోవడంతో పంట సాగు చేయడానికి రైతులు, మొక్కలు పెంచడానికి నర్సరీ యజమానులు కాస్త ఆలోచించారు. హఠాత్తుగా ధర పెరగడంతో టమోటా సాగు చేయడానికి రైతులు సిద్ధం అయ్యారు. దీంతో మొక్కలకు డిమాండ్‌ ఏర్పడింది. కావలసిన టమోటా మొక్కలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


గతంలో టమోటా మొక్కలు 40పైసల నుంచి 60 పైసలకు విక్రయించిన నర్సరీ యజమానులు డిమాండ్‌ పెరగడంతో ప్రస్తుతం ఒక రూపాయికి విక్రయిస్తున్నారు. రూపాయి చెల్లించి, టమోటా మొక్కలు కొనుగోలు చేస్తామన్నా, అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నర్సరీ యజమానులు లక్షలాది మొక్కలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు కూడా తమకు కావల్సిన మొక్కలను నర్సరీల్లో పెంచుకోవడానికి ముందుగానే నర్సరీ యజమానులకు అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ఒక ఎకరా సాగుకు 14వేల మొక్కలు అవసరం అవుతాయని రైతులు చెబుతున్నారు.


xx.jpgఅన్నీ సిద్ధం చేసుకున్నా..

ప్రస్తుతం టమోటా పంట సాగుచేయడానికి భూమిని సిద్ధం చేసి, కవర్‌కూడా పరిచాం. టమోటా మొక్కలు నర్సరీల్లో అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నాం. మండలంలోని కొక్కంటి క్రాస్‌, తనకల్లు, అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు అంగళ్లు, పెద్దతిప్పసముద్రం, తదితర ప్రాంతాల్లో ఎక్కడా టమోటా మొక్కలు ఆందుబాటులో లేవు. ముందుగానే నర్సిరీ యజమానులకు అడ్వాన్సు ఇచ్చి మొక్కల పెంపకం చేపట్టినా, ఇంకా 15రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. మండలంలో వందలాదిమంది రైతులు టమోటా మొక్కల కోసం కర్ణాటక రాష్ట్రానికి వెళ్తున్నారు.

  • అల్లం శివకుమార్‌రెడ్డి, రైతు, యర్రబల్లి


అందుబాటులో లేవు..

టమోటా మొక్కలు నర్సరీల్లో అందుబాటులో లేవు. టమోటా మొక్కలకోసం అన్నమయ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వెతికినా దొరడకంలేదు. కర్ణాటకలోని పలు ప్రాం తాలను సందర్శించినా, ప్రయోజనం శూన్యం. అడ్వాన్సు చెల్లించినా, అందుబాటులో లేవు. ఇంకా 20రోజులు ఆగాల్సి వస్తోంది. టమోటా మొక్కలకు ఇలా డిమాండ్‌ రావడం ఇదే మొదటి సారి. 40, 50పైసలకు ఇచ్చే మొక్కకు రూపాయి చెల్లించడానికి సిద్ధమైన మొక్కలు అందుబాటులో లేవు.

  • బయ్యారెడ్డి, రైతు, దుగినేపల్లి


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 28 , 2026 | 01:48 PM