గిట్టుబాటు లేని ‘రాగి’
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:23 PM
అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్లో క్వింటం రూ.4 వేలు
ప్రభుత్వ మద్దతు ధర రూ.4,886
రూ.6వేలు ఇవ్వాలని రైతుల డిమాండ్
కోనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూపు
మడకశిర(అనంతపురం): అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో సమీపంలోని కర్ణాటక ప్రాంతాల్లోని మార్కెట్లను ఆశ్రయించాల్సి వస్తోందని, అక్కడ ధరలు నిలకడగా లేక పోవడం, రవాణా ఖర్చులు కూడా అదనపు భారం అవుతుండడంతో మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. గత ఐదారు ఏళ్లుగా వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసి పలు కారణాలతో అవి దెబ్బతినడంతో తీవ్రంగా నష్ట పోయిన రైతులు ప్రత్యమ్నాయంగా ఈ సారి రాగి పంట సాగు వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వం కూడా రాగి పంట సాగును ప్రోత్సహించింది.
దీంతో పెట్టుబడి తక్కువ ఉంటుందని, రాబడి లాభదాయకంగా ఉంటుందని చాలా మంది రైతులు రాగి పం టను సాగు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో రాగి పంట సాగు చేయగా.. ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే 3500 ఎకరాల్లో సాగుచేశారు. పంటను సాగు చేసే మొదట్లో ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రాగులను కొనుగోలు చేస్తామని చెప్పింది. అయితే ఇంతవరకు ఏవీ చేయలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటను ఇళ్ల లోనే నిల్వ ఉంచుకున్నామని వాపోతున్నారు. రాగి సాగుకు ఎకరాకి రూ.35 వేలు పైగానే ఖర్చు వచ్చిందని, మార్కెట్లో క్వింటం రూ. 4 వేల నుంచి రూ. 4500 వరకు పలుకుతోందని అంటున్నారు. క్వింటా రూ.6వేలతో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ రైతులు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరతో మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
కొనుగోలుకు చర్యలు
రాగులను కోనగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. వారం రోజులలో రాగులను కొనుగోలు చేస్తాం. జిల్లా లో ఈ యేడు 8వేల ఎకరాలలో రైతులు రాగి పంటను పండించారు. కింటాకు మద్ధతు ధర రూ.4,886 చెల్లించి కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
క్రిష్ణయ్య, వ్యవసాయ శాఖ జేడీ
క్వింటా రూ.6వేలతో కొనుగోలు చేయాలి
గత ఏడాది కంటే ఈ సారి రాగి పంట సాగు కు పెట్టుబడి పెరిగింది. కోనగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రాగులను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంత వరకు ఆ మేరకు ఏచర్యలు చేపట్టలేదు. పండించిన పంటను ఇళ్లలోనే నిల్వ ఉంచుకున్నాం. రాగి పంట సాగు చేసేందుకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ. 35 వేల దాక ఖర్చు వచ్చింది. గతంలో కంటే ఈ సారి కూలీల కూలిఖర్చు, ఎరువుల ధరలు పెరిగాయి. కనుక రూ.6 వేల తో కొనగోలు చేస్తే గిట్టుబాటు అవుతుంది.
రంగనాథప్ప, రైతు, మల్లినమడుగు, రొళ్ల మండలం
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..
Read Latest Telangana News and National News