అమరావతి - హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:52 AM
చంద్రబాబు విజన్‌కు సెల్యూట్ చేస్తున్నామని, ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీపట్నం కాబోతోందన్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 28: చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీపట్నం కాబోతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister Ashwini Vaishnaw) అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సైబరాబాద్ నిర్మించారని.. ఐటీ అభివృద్ధిలో సైబర్ టవర్‌ది కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు విజన్‌కు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్‌గా కేంద్ర మంత్రి అభివర్ణించారు. యువనేత లోకేశ్ ఎనర్జీ, నాయకత్వం అద్భుతమని కొనియాడారు. సమస్యల పరిష్కారంలో యువనేతలకు లోకేశ్ ఆదర్శమని పేర్కొన్నారు.
తయారీ రంగంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ తయారీ అత్యంత కీలకమని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. 2024 నుంచి సెమీకండక్టర్ల తయారీపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు. గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖపట్నానికి రావడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
జూన్ 1 నుంచి విశాఖపట్నం రైల్వే జోన్‌ను నోటిఫై చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అమరావతి - హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య 70 నిమిషాల్లో, చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 08 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు. చెన్నై నుంచి కోల్‌కతా మధ్య రైల్వే లైన్లను 4 లేన్లుగా విస్తరించే పనులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టును హత్య చేసిన దుండగులు
గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Read Latest AP News And Telugu News