మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:47 PM
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత మార్చి 14న రాత్రి రోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఏప్రిల్ 28: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత మార్చి 14న రాత్రి రోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వారిలో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ శర్మ ఉన్నారు. రోహిత్ రెడ్డి తరఫున మాత్రమే న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
బెయిల్ మంజూరు అవడంతో రేపు(ఏప్రిల్ 29) చంచల్‌గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 14న మొయినాబాద్ ఫాంహౌస్‌లో దాడులు చేసిన పోలీసులు.. కొకైన్, లిక్కర్ బాటిళ్లు, ఫైర్ ఆర్మ్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న 11 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. ఒక నెలకు పైగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
అమరావతి - హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Read Latest Telangana News And Telugu News