Share News

టమోటా.. నష్టాల మూట!

ABN , Publish Date - Aug 29 , 2026 | 01:04 PM

ఆశల పంట నష్టాల మూటగా మారింది. టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి.

టమోటా.. నష్టాల మూట!
Tomato Farmers Losses

  • ధరలు పతనం

  • కూలి ఖర్చులు కూడా దక్కని వైనం

  • రోడ్డు పక్కనే పడేస్తున్న దుస్థితి

  • లక్షల్లో నష్టపోతున్న రైతులు

రొద్దం(అనంతపురం): ఆశల పంట నష్టాల మూటగా మారింది. టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి. రైతులకు పెట్టుబడులు కూడా దక్కట్లేదు. దీంతో అన్నదాతలు లక్షల రూపాయల పెట్టుబడులు నష్టపోతున్నారు. మండలంలోని ఆర్‌ కొట్టాల, రాచూరు, దొడగట్ట, ఆర్‌ మరువపల్లి, వైటిరెడ్డిపల్లి, రాగిమేకలపల్లి, బూచర్ల, బొక్సంపల్లి తదితర గ్రామాల్లో టమోటా సాగు చేశారు. ఎకరానికి రూ.లక్షదాకా పెట్టుబడి పెట్టారు. కట్టెలు నాటి దారం కట్టు పద్ధతి పాటిండచంతో ఖర్చులు పెరిగాయి. ఆర్‌ కొట్టాల గ్రామానికి చెందిన రైతు పెద్ద ఎర్రిస్వామి తనకున్న రెండెకరాల పొలంలో టమోటా పెట్టాడు.


toma1.jpgరూ.2 లక్షలు ఖర్చయింది. దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ధరలు పతనమవడంతో కూలీ ఖర్చులు కూడా రావడంలేదని రైతు వాపోయాడు. మార్కెట్‌లో 15 కేజీల టమోటా క్రేట్‌ రూ.150 పలుకుతోంది. పది మంది కూలీలకు రూ.300 చొప్పున ఇవ్వాలి. మార్కెట్‌కు తరలించడానికి వాహనానికి క్రేట్‌కు రూ.30 ఇవ్వాలి. మార్కెట్‌లో నూటికి రూ.2 కమిషన్‌ ఇవ్వాలి. తదితర వాటితో తడిసి మోపెడవుతున్నాయి. రోజుకు 200 క్రేట్లు వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.


toma1.2.jpgధరల్లేక పంటను వదిలేశా

రెండెకరాల్లో టమోటా సాగు చేశా. దిగుబడి బాగా వచ్చింది. ఎకరాకి రూ.లక్ష చొప్పున రూ.2 లక్షలు పెట్టుబడి అయింది. మార్కెట్‌కు తరలించే సమయంలో గిట్టుబాటు ధరలేక పంటను పూర్తిగా వదిలేశా. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.

  • అశ్వత్థనారాయణ, ఆర్‌ లోచర్ల


పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు

లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి టమోటా సాగు చేశా. కిలో రూ.10 చొప్పున అమ్ముడుపోతున్నాయి. ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావు. తీవ్రంగా నష్టపోతున్నా.

  • రామలింగ, నారనాగేపల్లి


toma1.3.jpgట‘మేత’

ఉరవకొండ: టమోటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. పంట కోత, మార్కెట్‌కు తరలించే ఖర్చులు కూడా రావట్లేదు. దీంతో కొందరు రైతులు పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. మరికొందరు రోడ్డుపక్కన పడేస్తున్నారు. ఉరవకొండ సమీపాన అనంతపురం-బళ్లారి రహదారిలోని పెట్రోల్‌ బంకు వద్ద టమోటా పంటను రైతులు పడేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేశానికే ఆదర్శంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ

ఆస్పత్రిలో వ్యక్తి మృతి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 01:04 PM