యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్: రాజ్‌నాథ్
ABN , Publish Date - May 15 , 2026 | 02:43 PM
యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
పుట్టపర్తి, మే 15 (ఆంధ్రజ్యోతి): యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) వ్యాఖ్యానించారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఏపీలో రూ.480 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రారంభిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ రోజు(శుక్రవారం) పుట్టపర్తిలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం చంద్రబాబు పర్యటించారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. పుట్టపర్తి - కోడూరు రోడ్డులోని 130 ఎకరాల విస్తీర్ణంలో డిఫెన్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు.
ఆయుధ ఉత్పత్తిలో స్వావలంబన దిశగా భారత్ అధ్యయనం చేస్తోందని తెలిపారు. రక్షణ శాఖలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనేది కేంద్ర లక్ష్యమని ఉద్ఘాటించారు. గత పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య అంతరం తగ్గించడానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. డ్రోన్ హబ్‌గా కర్నూలు ఉంటుందని స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.