Share News

నన్నారి.. ఆ టేస్టే వేరుగా..

ABN , Publish Date - May 01 , 2026 | 09:55 AM

వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాల్లో ప్రముఖమైనది నన్నారి. స్వచ్ఛమైన వేర్లతో తయారు చేసే ఈ నన్నారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నన్నారి.. ఆ టేస్టే వేరుగా..
Nannari Drink

  • వేసవిలో శీతల పానీయంలా నన్నారీ

  • తయారీకి ప్రసిద్ధిగాంచిన గాండ్లపెంట

  • విదేశాలకు సైతం ఎగుమతి

గాండ్లపెంట(అనంతపురం): వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాల్లో ప్రముఖమైనది నన్నారి. స్వచ్ఛమైన వేర్లతో తయారు చేసే ఈ నన్నారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యప్రదాయిని అయిన ఈ నన్నారి తయారీకి గాండ్లపెంట ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ తయారు చేసే నన్నారి రుచి, వాసన బాగుండటంతో ఇతర ప్రాంతాలు, విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు.


pandu1.2.jpgతయారీ ఇలా..

తొలుత నన్నారి వేర్లను బాగా ఎండబెట్టి వాటిని చిన్న ముక్కలుగా కోసి, కట్టెల పొయ్యి మీద ఉడకబెడతారు. ఉడికించిన వేర్ల నుంచి వచ్చిన ద్రవాన్ని వడబోస్తారు. ఆ తరువాత దానికి చెక్కెర పాకాన్ని నన్నారికి కలుపుతారు. ఇలా వేర్లతో తయారీ చేసిన నన్నారిని బాటిళ్లకు నింపుతారు. బాటిళ్లలో నింపిన నన్నారీ దాదాపు ఆరు నెలల పాటు పాడవ్వదని తయారీదారులు చెబుతున్నారు. తాతల కాలం నుంచి నన్నారీ తయారీనే జీవనోపాధిగా మార్చుకున్నట్లు కొందరు తెలిపారు. అలా తయారైన నన్నారీని కొంచెం గ్లాసులో వేసుకుని, సోడా, నీరు, నిమ్మకాయ, సబ్జా గింజలు కలిపి తాగితే ఆ టేస్ట్‌ మరో లెవల్లో ఉంటుందని నన్నారీప్రియులు చెబుతున్నారు. గాండ్లపెంటలో మధ్యాహ్నం నుంచి నన్నారీ తాగేందుకు ప్రజలు ఎగబడుతుంటారు.


pandu1.3.jpgఇతర దేశాలకు తీసుకెళుతున్నారు

గాండ్లపెంటలో మేము తయారీ చేసే నన్నారీని ఇతర ప్రాంతాలకే కాక అమెరికా, సౌదీ, గల్ఫ్‌ దేశాలకు కూడా తీసుకొని వెళ్తున్నారు. స్వచ్ఛమైన, సువాసన కలిగిన మంచి వేర్లతో నన్నారీని తయారు చేస్తాం. దీని వలన మంచి ఆరోగ్యం, వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. మా పూర్వీకుల నుంచి నన్నారీ తయారీని వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాం.

  • మహబూబ్‌బాషా, నన్నారీ తయారీదారుడు, గాండ్లపెంట


ఈ వార్తలు కూడా చదవండి:

జగన్ బెల్స్ లా.. వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.. మంత్రి పార్థసారథి సెటైర్లు

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2026 | 09:55 AM