Share News

అనవసర గొడవలతో నష్టపోకండి

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:00 PM

మాలాంటి నాయకులంతా బాగానే ఉంటామని, అనవసర గొడవలతో నష్టపోయేది కింది స్థాయి కేడరేనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

అనవసర గొడవలతో నష్టపోకండి
JC Prabhakar Reddy

  • మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్‌

తాడిపత్రి(అనంతపురం): మాలాంటి నాయకులంతా బాగానే ఉంటామని, అనవసర గొడవలతో నష్టపోయేది కింది స్థాయి కేడరేనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో జరిగిన ఘటనల గురించి మాట్లాడారు. ఈ మూడు మండలాల్లో ఈ వారంలో జరిగిన సంఘటన వల్ల నష్టపోయినది మీరేనన్న విషయం తెలుసుకుని గొడవల జోలికి వెళ్లవద్దని కార్యకర్తలకు సూచించారు.


jcp1.2.jpgఇటీవల జరిగిన ఘర్షణల్లో నష్టపోయిన వారికి ఎన్నికల అనంతరం చేతనైన సాయం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. యల్లనూరు, పుట్లూరు మండలాల్లో జరిగిన ఘటనల్లో నష్టపోయిన వారికి క్షమాపణ చెప్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రెండు మండలాల్లో ఫ్యాక్షన్‌ నశించి, అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నువ్వు సూపర్‌ లక్ష్మీ..!

చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 12:01 PM