Share News

రాప్తాడులో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్.. వైసీపీ ఆరోపణలపై పరిటాల సునీత ఫైర్

ABN , Publish Date - Nov 05 , 2026 | 10:56 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పరిటాల కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. నసనకోట ప్రభుత్వ పాఠశాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాప్తాడులో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్.. వైసీపీ ఆరోపణలపై పరిటాల సునీత ఫైర్
MLA Paritala Sunitha

శ్రీ సత్యసాయి జిల్లా, నవంబర్ 5: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పరిటాల కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. నసనకోట ప్రభుత్వ పాఠశాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ గొడ్డలి పార్టీ వారు అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీకి చెందిన కొందరు మాట్లాడటం సబబుకాదన్నారు.


ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయబోతుందని పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు 12.66 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు శారు.


ఇవి కూడా చదవండి...

మున్సిపల్ ఫలితాలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి

చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 11:18 AM