Share News

చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్

ABN , Publish Date - Nov 05 , 2026 | 10:21 AM

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురు మదురు సంఘటనలు మినహా పరిషత్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్
Kadapa Political Tensions

అమరావతి, నవంబర్ 5: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురు మదురు సంఘటనలు మినహా పరిషత్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. యధావిధిగా ఉమ్మడి కడప జిల్లాలో ఘర్షణలకు వైసీపీ రెచ్చగొడుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని వివిధ గ్రామాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలు తెరలేపారని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. లింగాల మండలం పార్నపల్లెలో ఎంపీ అవినాశ్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ మూకల గొడవలకు దిగారని తెలుగుదేశం పార్టీ శ్రేణలు ఆరోపణలు గుప్పించారు.


పార్నపల్లెలో ప్రశాంతతను చెడగొట్టేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ ఫైర్ అయ్యింది. అటు తుమ్మలపల్లెలోనూ టీడీపీ నేతలపై వైసీపీ మూకలు దాడులకు యత్నిస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గం గండ్లకుంటలో వైసీపీ నేత జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి అరాచకం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండ్లకుంటలోని పోలింగ్ బూత్లలో ఉన్న టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేత రామసుబ్బారెడ్డి బయటకు తోసేసారని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.


తన సొంత గ్రామంలో టీడీపీ ఏజెంట్లు ఉండడానికి వీల్లేదని రామసుబ్బారెడ్డి చెప్పడం రచ్చకు దారి తీసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన కారణంగా అసహనంతో వైసీపీ దాడులకు కుట్ర చేస్తోందని కూటమి విమర్శలు గుప్పిస్తోంది. అయితే వైసీపీ మూకలు కవ్వించినా... సంయమనం పాటించాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.


ఇవి కూడా చదవండి...

స్కూళ్ల ఏర్పాటుకు నిబంధనల సడలింపు

మున్సిపల్ ఫలితాలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 10:39 AM