Share News

కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం..

ABN , Publish Date - Nov 05 , 2026 | 09:26 AM

పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందుల పార్నపల్లిలో అనుచరులతో కలిసి కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి పోలింగ్ కేంద్రం వద్ద హల్‌చల్ చేశారు.

కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం..

కడప, నవంబర్ 05: పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందుల పార్నపల్లిలో అనుచరులతో కలిసి కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి పోలింగ్ కేందం వద్ద హల్‌చల్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అవినాశ్ వాగ్వాదానికి దిగారు. దీంతో పార్నపల్లిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.


గుండ్లకుంటలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

మరో వైపు పెద్దముడియం మండలం గుండ్లకుంటలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. రెండు పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తోసేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. వారి సహయంలో మళ్లీ టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారు. స్థానిక పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్ళారు. దీంతో గుండ్లకుంటలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


తుమ్మలపల్లిలో ఘర్షణ..

పులివెందుల సమీపంలోని ఆర్ తుమ్మలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఇరు వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వైసీపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. దాంతో ఆర్ తుమ్మలపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలి: సీఎం చంద్రబాబు

శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

For More TG News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 10:05 AM