Share News

కూటమి పాలనలో అభివృద్ధి జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోంది: కేంద్రమంత్రి తోఖన్ సాహు

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:51 PM

స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని టవర్ క్లాక్ నుంచి పాతూరు వరకు చేపట్టిన ఈ ర్యాలీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమారి యాదవ్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

కూటమి పాలనలో అభివృద్ధి జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోంది: కేంద్రమంత్రి తోఖన్ సాహు
rally in ananthapuram

అనంతపురం, అక్టోబర్ 30: ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులనే గెలిపించాలని కేంద్ర గృహ నిర్మాణ సహాయక మంత్రి తోఖన్ సాహు పేర్కొన్నారు. ఈ మేరకు సహాయక మంత్రి సాహు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.


‘ఇంత మండే ఎండలో ఇంతమంది హాజరవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ మేయర్ అభ్యర్థి అజేశ్ బాబుని గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత మాది. అనంతలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ పాలనలో అభివృద్ధి జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోంది. పట్టణాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు కృషి ఎనలేనిది. కూటమి తరఫున టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థులను ఆశీర్వదిస్తే సంక్షేమం మరింత పొందవచ్చు. పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ. పేదలకు సొంతిల్లు అంటే ఓ కల.. నరేంద్ర మోదీకి ఇది బాగా తెలుసు. అందుకే ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చాలని కంకణం కట్టుకున్నారు. పట్టణాభివృద్ధికి మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థులకే వేయాలి. ఈ అభివృద్ధిని కొనసాగించే అవకాశం ఇవ్వాలి’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ ర్యాలీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎమ్మెల్సీ రమాదేవి, జనసేన జిల్లా అధ్యక్షుడు అహుడ చైర్మెన్ టి.సి. వరుణ్, మేయర్ అభ్యర్థి అజేశ్ బాబు, కూటమి కార్పొరేట్ అభ్యర్థులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!

మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 01:55 PM