రాజమండ్రి పురపాలక సంస్థలో 11 గ్రామాల విలీనం.. ప్రభుత్వ గెజిట్ విడుదల
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:13 PM
రాజమండ్రి పురపాలక సంస్థలో 11 గ్రామాలను విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ను విడుదల చేసింది.
రాజమండ్రి, అక్టోబర్ 18: జిల్లాలోని 11 గ్రామాలను రాజమండ్రి పురపాలక సంస్థలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో పురపాలక సంస్థ పరిధి 90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగింది.
రాజమండ్రిలోని హుకుంపేట, శాటిలైట్ సిటీ, పిడింగొయ్యి, బొమ్మూరు, ధవళేశ్వరం, వేమగిరి, లాలాచెరువు, కాతేరు, తొర్రేడు, వెంకటనగరం, రాజవోలు గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 11 గ్రామాల విలీనంతో రాజమండ్రి పురపాలక సంస్థ పరిధి 44.5 చదరపు కిలోమీటర్ల నుంచి 90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగింది. కొత్త గ్రామాల జనాభాతో.. నగరపాలక సంస్థ మొత్తం జనాభా 5,13,299కి చేరింది. ఈ క్రమంలో ఒక్కో డివిజన్లో 6,417 నుంచి 7,841 ఓటర్లు ఉండేలా కొత్తగా 72 డివిజన్లకు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 72 డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ
రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News