TDP Activist: వైసీపీతో ప్రాణగండం..టీడీపీ కార్యకర్త చివరి వీడియో

ABN, Publish Date - Mar 17 , 2025 | 02:49 PM

పెద్దిరెడ్డి అరాచకాలను ప్రశ్నించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణనాయుడును కొంతమంది వైసీపీ నేతలు హత్యచేశారు. అయితే రామకృష్ణనాయుడు చనిపోయే ముందు ఓ వీడియో విడుదల చేశారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ అధికారంలో లేకపోయినా ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. పెద్దిరెడ్డి అండ చూసుకుని చేలరేగిపోతున్నారు.పెద్దిరెడ్డి అరాచకాలను ప్రశ్నించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణనాయుడును కొంతమంది వైసీపీ నేతలు హత్యచేశారు. అయితే రామకృష్ణనాయుడు చనిపోయే ముందు ఓ వీడియో విడుదల చేశారు. తన చావుకు వైసీపీ నేతలు కారణమని ఈ వీడియోలో రామకృష్ణనాయుడు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎన్. గణపతి, ఎన్. మహేష్, కే. వెంకటరమణ తన హత్యకు కారణమని వీడియోలో తెలిపారు. గతంలో తనపై దాడి చేసి అసభ్యంగా తిట్టారని రామకృష్ణనాయుడు వీడియోలోొ చెప్పారు.


గతంలో తనను బెదిరించారని రామకృష్ణనాయుడు అన్నారు. వీరిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నా కనికరించలేదని రామకృష్ణనాయుడు తెలిపారు. ఎన్నికల నాటి నుంచి రామకృష్ణనాయుడుపై కక్షగట్టి కత్తితో దాడి చేసి హతమార్చారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రామకృష్ణనాయుడిపై నాలుగుసార్లు హత్యాయత్నం చేశారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.


కాగా.. గతంలో పెద్దిరెడ్డిపై చాలా ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. గతంలో అంగళ్లులో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై దాడికి ప్లాన్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో పెద్దిరెడ్డిపై చాలా ఆరోపణలు వచ్చాయి. అడవుల ఆక్రమణ, ఎర్రచందనం స్మగ్లింగ్, గనులు కొల్లగొట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వీటిపై విచారణ చేసినా పెద్దిరెడ్డిపై ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...


ఈ వార్తలు కూడా చదవండి...

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Jathvani False Cases: సీఎం, హోంమినిస్టర్.. న్యాయం చేయండి ప్లీజ్

Read Latest AP News And Telugu News

Updated at - Mar 17 , 2025 | 02:58 PM