Kaleshwaram Project: కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ
ABN, Publish Date - Aug 04 , 2025 | 10:00 AM
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రత్యేక బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై తెలంగాణ అంసెబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రత్యేక బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై తెలంగాణ అంసెబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు వరంగా గత కేసీఆర్ ప్రభుత్వం అభివర్ణించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ప్రజాధనం వృథా చేసిన ప్రాజెక్టుగా మారిందంటూ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిన విషయాలను ప్రజలకు వివరించేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇవాళ(సోమవారం) నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్ ఫోకస్
డ్రగ్స్ కేసుల్లో పబ్బులకు లింకులు
Read latest Telangana News And Telugu News
Updated at - Aug 04 , 2025 | 10:00 AM