Share News

Cyberabad She Teams: మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్‌ ఫోకస్‌

ABN , Publish Date - Aug 04 , 2025 | 07:20 AM

మహిళలు, పిల్లల రక్షణ కోసం సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని డీసీపీ సృజన కరణం పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఇంటా,బయట పిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సైబరాబాద్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ సేప్టీ వింగ్‌ ప్రత్యేకంగా పనిచేస్తోందన్నారు.

Cyberabad She Teams: మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్‌ ఫోకస్‌
Cyberabad She Teams

షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 96 డెకాయి ఆపరేషన్స్‌

పాఠశాలల్లో సురక్షా కవచ్‌ కార్యక్రమం

వివరాలు వెల్లడించిన డీసీపీ సృజన

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మహిళలు, పిల్లల రక్షణ కోసం సైబరాబాద్‌ షీ టీమ్స్‌ (Cyberabad She Teams) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని డీసీపీ సృజన కరణం పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఇంటా,బయట పిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సైబరాబాద్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ సేప్టీ వింగ్‌ ప్రత్యేకంగా పనిచేస్తోందన్నారు. గత నెల 28 నుంచి ఆగస్టు 2 వరకు షీ టీమ్స్‌ 96 డెకాయ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించి 47 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు 22 ఫిర్యాదులు వచ్చాయని, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో 24 కుటుంబాలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి భార్యాభర్తల గొడవలకు పరిష్కారం చూపామన్నారు.


విద్యార్థుల భద్రతకు సురక్షా కవచ్‌

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చిల్డ్రన్‌ అండ్‌ యూత్‌ సేఫ్టీ ఫోరం ఆధ్వర్యంలో సురక్షా కవచ్‌ కార్యక్రమం నిర్వహించామని డీసీపీ తెలిపారు. పాఠశాల విద్యార్థుల భద్రత నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో తొలిసారి ఈ కారక్రమాన్ని చేపట్టి పలు అంశాలపై అవగాహన కల్పించామన్నారు. ముఖ్యంగా శారీరక భద్రత, సైబర్‌ భద్రత, మాసిక ఒత్తిడి, రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేఫ్టీ అంశాలపై నిపుణులు విద్యార్థులకు సూచనలు చేసినట్లు తెలిపారు. స్కూల్‌ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు

కవిత గురించి మాట్లాడటం వృథా.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 07:22 AM