తెలంగాణలో రికార్డు లెవెల్ లిక్కర్ సేల్స్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?

ABN, Publish Date - Oct 03 , 2025 | 12:40 PM

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల్లో రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్లు మద్యం అమ్మకాలు చేసినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దసరా సందర్భంగా రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటో తేదీల్లో భారీగా మద్యం కొనుగోలు చేశారు మందుబాబులు. రెండు రోజుల్లో రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన రూ. 333 కోట్లు మద్యం అమ్మకాలు చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ ఒకటో తేదీన 86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయని వివరించారు. దసరా, అక్టోబర్ 2(గాంధీ జయంతి) ఒకేరోజు రావడంతో.. అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

TamilNadu Bomb Threat: సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపులు..

Notorious Cattle Thief : చోరీ చేసిన పశువులను వధిస్తున్న యూనిట్‌పై పోలీసు దాడులు

Updated at - Oct 03 , 2025 | 12:54 PM