Cyclone Montha: మొంథా తుపాను భయం.. మూడు రోజులకు సరిపడా కూరగాయల కొనుగోలు

ABN, Publish Date - Oct 28 , 2025 | 06:40 PM

మొంథా తుపాను విజయవాడ ప్రజలను భయభ్రాంతులకి గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించారు.

విజయవాడ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను విజయవాడ ప్రజలను భయభ్రాంతులకి గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించారు. ప్రజలు ముందు జాగ్రత్తగా పాలు, మెడిసిన్, కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో విజయవాడలోని పడమట రైతు బజార్‌లో కూరగాయలు అయిపోయాయి. తుపాను నేపథ్యంలో కూరగాయలను ప్రజలు పెద్దఎత్తులో కొనుగోలు చేశారు. కూరగాయలు లేక మరికొంతమంది వెనుదిరుగుతున్నారు. తుపాను ప్రభావంతో కూరగాయల మార్కెట్‌లో రద్దీ నెలకొంది. ఈ క్రమంలో మూడు రోజులకి సరిపడా కూరగాయలని ప్రజలు కొనుగోలు చేశారు.


ఇవి కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated at - Oct 28 , 2025 | 06:43 PM