Share News

Dharmendra Pradhan: అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా.. సమ్మక్క - సారక్క: ధర్మేంద్ర ప్రధాన్

ABN , Publish Date - Oct 07 , 2025 | 07:08 PM

సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని ఉద్ఘాటించారు.

Dharmendra Pradhan: అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా.. సమ్మక్క - సారక్క: ధర్మేంద్ర ప్రధాన్
Dharmendra Pradhan

ఢిల్లీ, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (Sammakka Sarakka Tribal University) ఏర్పడుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వ్యాఖ్యానించారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని ఉద్ఘాటించారు. సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఇవాళ(మంగళవారం) ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, యూనివర్సిటీ వీసీ వై. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ఈ యూనివర్సిటీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చని చెప్పుకొచ్చారు. తెలుగు, హిందీ, మరాఠీతో సహా లోకల్ ట్రైబల్ భాషను మెరుగు పరచవచ్చని వెల్లడించారు ధర్మేంద్ర ప్రధాన్.

Dharmendra-Pradhan.jpg


సమ్మక్క - సారక్క యూనివర్సిటీ లోగో వినూత్నంగా ఉందని తెలిపారు. యూనివర్సిటీ లోగోలో ట్రైబల్ భాషలు కోయ, బంజారా, గోండు భాషలు పొందుపరచడంపై అభినందించారు ధర్మేంద్ర ప్రధాన్. త్వరలో సమ్మక్క - సారక్క యూనివర్సిటీని సందర్శిస్తా, కొత్త క్యాంపస్‌కి శంకుస్థాపన చేస్తానని మాటిచ్చారు. సమ్మక్క -సారక్క ట్రైబల్ యూనివర్సిటీని విభజన చట్టంలో పొందుపరిచారని గుర్తుచేశారు. తాము విభజన చట్టం చేయకపోయినా యూనివర్సిటీ ఏర్పాటుకు కట్టుబడి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని నొక్కిచెప్పారు. ఈ యూనివర్సిటీకి రూ. 800 కోట్లకు పైగా నిధులు కేటాయించామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.


ప్రత్యేకంగా లోగో..

సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోలో ప్రధాన ఆకర్షణగా పలు చిహ్నాలు ఉన్నాయి. సమ్మక్క - సారక్క ట్రైబల్ యూనివర్సిటీ లోగో మధ్యలో సమ్మక్క - సారక్కల పసుపు బొమ్మలు ఉన్నాయి. సమ్మక్క దేవతని కుంకుమతో సూచించేలా మధ్యలో ఉన్న ఎర్రటి సూర్యుడుని పొందుపరిచారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై దైవతల బొమ్మలు ఉన్నాయి. గిరిజన దుస్తులు, సౌందర్యానికి అంతర్భాగంగా నెమలి ఈకలని పొందుపరిచారు. ఈ లోగోలో సాంస్కృతిక గౌరవం, ధైర్యం సంప్రదాయాన్ని సూచించే రెండు కోణాల జంతువుల కొమ్ములతో కూడిన కిరీటం ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 08:31 PM