Minister Konda Surekha Fires ON BRS: సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. బీఆర్ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఫైర్
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:37 PM
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నేతలు కలిసి స్థానిక ఎన్నికలని అడ్డుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
వరంగల్, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నేతలు కలిసి స్థానిక ఎన్నికలని అడ్డుకున్నారని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్‌కి కట్టుబడి 42శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని.. తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిపి ఆమోదించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తూర్పు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధులు అందించామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం రూ.200 కోట్ల నిధులను తమ ప్రభుత్వం కేటాయించిందని ప్రకటించారు మంత్రి కొండా సురేఖ.
త్వరలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకి భూమి పూజ చేస్తామని వివరించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు అందించామని స్పష్టం చేశారు. త్వరలోనే వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేశామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాగంటి సునీతని అవమానిస్తారా.. మంత్రులపై బీఆర్ఎస్ ఫైర్
బీసీల వాదన వినకుండా కోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చింది: ఆర్.కృష్ణయ్య
Read Latest Telangana News And Telugu News