Konda Murali: ప్రజాస్వామ్యబద్ధంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక: కొండా మురళి
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:42 PM
ప్రజాస్వామ్యబద్ధంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. పట్నాయక్ రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అండగా ఉన్నారని కొండా మురళి ఉద్ఘాటించారు.
వరంగల్,అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యబద్ధంగా వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (Konda Murali) పేర్కొన్నారు. పట్నాయక్ రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అండగా ఉన్నారని ఉద్ఘాటించారు. ఇవాళ(గురువారం) వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, డీసీసీ అధ్యక్ష ఎన్నికల పరిశీలకులు నవజ్యోతి పట్నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా మురళి మీడియాతో మాట్లాడారు.
ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోండటంతో వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) కార్యకర్తల సమావేశానికి మంత్రి కొండా సురేఖ రాలేకపోయారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పట్నాయక్‌కి కొండా సురేఖ ఏ పరిస్థితుల్లో ఈ సమావేశానికి రాలేక పోతున్నారనే విషయాన్ని వివరించారు. సంఘటన్ శ్రీజన్ అభియన్ ప్రత్యేక కార్యక్రమంతో రాహుల్ గాంధీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. పోరాటాల గడ్డ ఓరుగల్లు అని కొండా మురళి అభివర్ణించారు.
కార్యకర్త అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్ష ఎన్నిక: నవజ్యోతి పట్నాయక్
ప్రజాధారణ ఉన్న నాయకునికి డీసీసీ అధ్యక్ష పదవి దక్కుంతుందని డీసీసీ అధ్యక్ష ఎన్నికల పరిశీలకులు నవజ్యోతి పట్నాయక్ స్పష్టం చేశారు. సంఘటన్ శ్రీజన్ అభియన్ ప్రత్యేక కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. డీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతుందని తెలిపారు నవజ్యోతి పట్నాయక్.
క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం డీసీసీ అధ్యక్ష ఎన్నిక పూర్తి అవుతుందని వివరించారు. కార్యకర్తలే కాంగ్రెస్‌కి బలమని కొనియాడారు. కార్యకర్త అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. తాను రిపోర్టు రాసి ఏఐసీసీకి అందిస్తానని.. అది తన బాధ్యత అని నొక్కిచెప్పారు. కాంగ్రెస్ నేతలు ఎవరికైనా డీసీసీ అధ్యక్షుడిని కావాలని ఉంటే పేరు నమోదు చేసుకోవాలని నవజ్యోతి పట్నాయక్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మైనర్లతో వీడియోలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జరిగేది ఇదే: పీసీసీ చీఫ్
Read Latest Telangana News And Telugu News