BRS To Congress: నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జరిగేది ఇదే: పీసీసీ చీఫ్
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:06 PM
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అని అన్నారు. ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలని కాబట్టే నవీన్ యాదవ్‌ను పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిందని వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: కాంగ్రెస్ బూత్ స్థాయి సన్నాహక సమావేశం ఈరోజు (గురువారం) సోమాజిగూడ శ్రీనగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి (Congress) భారీ చేరికలు జరిగాయి. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ మహిళ నేత ఆది లక్ష్మీ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళా నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. పదేళ్ల విధ్వంస పాలనకు.. రెండేళ్ల వికాస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అని అన్నారు. ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలి కాబట్టే నవీన్ యాదవ్‌ను పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిందని వెల్లడించారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే ప్రజల మధ్యనే ఉంటారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వ్యక్తి కావాలని నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పదేళ్ల పాలనలో ఎలా జరిగిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మయంగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని వ్యాఖ్యలు చేశారు. యువతను మత్తుకు బానిస చేశారని పీసీసీ చీఫ్ ఆరోపించారు.
నవీన్ యాదవ్‌ను గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 85 శాతం బీద జనం ఉన్నారని.. కాంగ్రెస్ గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ నేతృత్వంలో కుల సర్వే నిర్వహించామన్నారు. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి కాంగ్రెస్ బీసీ అభ్యర్ధిని ప్రకటించిందని తెలిపారు. సర్వేల ఆధారంగా జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషితో 50 వేలకు పైగా మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్‌ను గెలిపించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల విష ప్రచారం నమ్మవద్దని.. ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ రియాజ్, కార్పొరేటర్లు విజయా రెడ్డి, సంగీత, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఎన్‌సీయూఐ సెక్రటరీ కుందన్ యాదవ్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, స్థానిక సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోయిన సైకో.. తల్లిదండ్రులపైనే
Read Latest Telangana News And Telugu News