Hyderabad: దీపావళి వేళ విస్తృత తనిఖీలు.. స్వీట్‌లలో ప్రమాదకమైన రసాయనాలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:07 PM
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో స్వీట్ షాపులపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని 43 స్వీట్ షాప్స్ లో 3 రోజుల పాటు అధికారులు ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గడువు ముగిసిన పదార్థాలు స్వీట్ల తయారీలో వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: కొద్దిరోజుల్లో దీపావళి పండుగ పండుగ రానుంది. ఇంటిల్లిపాది పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని మిఠాయిలు పంచుకొని తింటారు. ప్రత్యేకమైన స్వీటులను కొనుగోలు చేసి కుటుంబ సభ్యులంతా సంతోషాలను పంచుకుంటూ ఆరగిస్తారు. దీపావళి సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో భారీగా స్వీట్ల అమ్మకాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీపావళి సందర్భంగా హైదరాబాద్ నగరంలో స్వీట్ షాపులపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలోని 43 స్వీట్ షాప్స్‌లో 3 రోజుల పాటు అధికారులు ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గడువు ముగిసిన పదార్థాలు స్వీట్ల తయారీలో వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్‌లలో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు.
మిఠాయిలల్లో ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు నిర్ధారించారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీపావళి గిరాకీ ఎక్కువగా వస్తుందని నాసిరకంగా టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేస్తుండటంతో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హెచ్చరించారు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్స్ కి నోటీసులు, భారీ పెనాల్టీలు విధించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Minister Konda Surekha: కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్
Kavitha: అందుకే కేసీఆర్ ఫొటో పెట్టలేదు.. మా దారులు వేరయ్యాయి