Share News

Kavitha: అందుకే కేసీఆర్‌ ఫొటో పెట్టలేదు.. మా దారులు వేరయ్యాయి

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:22 AM

చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకొనే మనస్తత్వం తనది కాదని, అందుకే.. జాగృతి జనంబాటలో తన తండ్రి కేసీఆర్‌ ఫొటో పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపేర్కొన్నారు. తాను బీఆర్‌ఎస్‏లో లేను ప్రజల కోసం ఏం చేయాలన్న దానిపై తోవ వెతుక్కుంటున్నా... ‘మా దారులు వేరయ్యాయి.. అలాంటప్పుడు ఆయన ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని అన్నారు.

Kavitha: అందుకే కేసీఆర్‌ ఫొటో పెట్టలేదు.. మా దారులు వేరయ్యాయి

- ఆయన చెట్టునీడలో దుర్మార్గులున్నారు

- ‘జనంబాట’లో ప్రజాభిప్రాయం మేరకే పార్టీ ఏర్పాటు నిర్ణయం

- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌: చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకొనే మనస్తత్వం తనది కాదని, అందుకే.. జాగృతి జనంబాటలో తన తండ్రి కేసీఆర్‌ ఫొటో పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. తాను బీఆర్‌ఎస్‏లో లేను ప్రజల కోసం ఏం చేయాలన్న దానిపై తోవ వెతుక్కుంటున్నా... ‘మా దారులు వేరయ్యాయి.. అలాంటప్పుడు ఆయన ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని అన్నారు. బుధవారం బంజారాహిల్స్‌ జాగృతి కార్యక్రమంలో ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు చేపట్టనున్న జనంబాట.. పోస్టర్‌ను విడుదల చేశారు.


city9.2.jpg

అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ అనే చెట్టునీడలో ఉన్న అన్ని రోజులూ ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడినందుకే కుట్ర చేసి పార్టీ నుంచి పంపిచారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఫొటోతో జనం బాటపట్టడం నైతికతకాదని తెలిసి అలాంటి పని చేయడం లేదన్నారు. ఇది అగౌరవపరిచే ఉద్దేశం ఏ మాత్రమూ కాదన్నారు. తన తండ్రి లేకుండా తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం లేదన్నారు. తెలంగాణ జాగృతి మొదలు పెట్టినప్పుడు కేవలం జయశంకర్‌ సార్‌ ఫొటో మాత్రమే ఉండేదని, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే జాగృతిలో కేసీఆర్‌ ఫొటో పెట్టామని గుర్తుచేశారు.


అప్పుడే భవిష్యత్‌ కార్యాచరణ

ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని వారిచ్చే సలహాలు, సూచనల ఆధారంగానే భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని కవిత పేర్కొన్నారు. ప్రజల మనోగతం తెలుసుకునేందుకు గాను అన్ని వర్గాల వారిని కలిసేందుకు జాగృతి ఆధ్వర్యంలో ‘జనంబాట’ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 25న నిజామాబాద్‌(Nizamabad) జిల్లా నుంచి జనంబాట యాత్ర (ఇది పాదయాత్రకాదు) ప్రారంభిస్తామన్నారు. 4 నెలల పాటు ప్రతీ జిల్లాలో రెండు రోజుల చొప్పున అన్ని వర్గాలతో సమావేశమై చర్చలు జరుపుతామన్నారు. కార్యక్రమం పూర్తయ్యాక అన్ని వర్గాల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ఆ మేరకు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా

వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2025 | 11:22 AM