Minister Konda Surekha: కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:47 AM
కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీ అనంతరం మీడియాతో మంత్రి సురేఖ ఏం మాట్లాడతారు? ఈ సమస్యపై మంత్రి వర్గం స్పందన ఎలా ఉంటుంది? జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే ఈ వివాదంపై అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్, అక్టోబర్ 16: తన ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ వివాదంపై కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ నేత కొండా మురళి ఇవాళ ఉదయం మీడియాతో చెప్పారు. సీఎం సహా రెడ్డి మంత్రులందరనీ టార్గెట్ చేస్తూ కూతురు కొండా సుస్మితా అటు ఘాటు వ్యాఖ్యలు చేశారు బీసీల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీ అనంతరం మీడియాతో మంత్రి సురేఖ ఏం మాట్లాడతారు? ఈ సమస్యపై మంత్రి వర్గం స్పందన ఎలా ఉంటుంది? జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే ఈ వివాదంపై అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అటు ఇవాళ ఉదయం మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఓఎస్డీ సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు తెల్లవారుఝాములే చేరుకున్నారు. ఇంటికి వెళ్లి అతన్ని పట్టుకోబోతుండగా.. మా ఇంటికి ఎందుకొచ్చారు? అంటూ మంత్రి కూతురు కొండ సుస్మిత పోలీసులతో గొడవకు దిగారు. సుమంత్ అని అదుపులోకి తీసుకుందామని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పెద్దలే ఇదంతా కావాలని చేస్తున్నారని సుస్మిత ఆరోపించారు. కొండ సురేఖ ఇంట్లోనే సుమంత్ తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది. నిన్న సుమంత్ ను బాధ్యతల నుండి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమంత్ కోసం పోలీసులు నిన్నటి నుండి గాలిస్తున్నారు.
అటు హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం కాంగ్రెస్ నేత, కొండా సురేఖ భర్త మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితో తమకెలాంటి వైరుధ్యాలు లేవని క్లారిటీ ఇచ్చారు. మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకు తెలియదని, కొండా సురేఖ ఛాంబర్‌కు తాను ఇప్పటివరకు పోలేదని వ్యాఖ్యానించారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారని.. కచ్చితంగా ఇస్తారని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
Kavitha: అందుకే కేసీఆర్ ఫొటో పెట్టలేదు.. మా దారులు వేరయ్యాయి
Jubli Hills: నాన్న కోటలో.. అక్కా వర్సెస్ తమ్ముడు