Heartbreaking Incident: సిద్దిపేటలో హృదయవిదారక ఘటన..
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:24 AM
సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో వృద్ధ దంపతులు గొడుగు పోచయ్య, యాదవ్వ నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు యాదగిరి, రమేశ్, ఓ కుమార్తె ఉంది.
సిద్ధపేట, అక్టోబర్ 16: రాను రాను మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి. అయిన వారి పట్ల మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు చాలా మందే ఉన్నారు. కని, పెంచి, పెద్ద చేసిన పేరెంట్స్‌ను పట్టించుకోకుండా తమ దారి తాము చూసుకుంటున్నారు పిల్లలు. రెక్కలొచ్చాక ఎదిగిపోయి... ఏ మాత్రం పట్టించుకోని పిల్లలను చూస్తున్న వృద్ధ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. బతికున్నప్పుకు చూడపోయినా కనీసం చనిపోయినప్పుడు అయినా చివరి చూపు, దహన సంస్కారాలు చేస్తారని ఆశపడుతుంటారు తల్లిదండ్రులు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం తమ కన్నవారు చనిపోయినా కూడా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. చివరి చూపుకు కూడా రాకుండా మొహం చాటేస్తుంటారు. ఇలాంటి ఘటనే సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వృద్ధాప్యంతో ఓ వ్యక్తి చనిపోయాడు. అతడికి సంతానం కూడా ఎక్కువే. కానీ ఏం లాభం చనిపోయిన తర్వాత ఆ వృద్ధుడి మృతదేహాన్ని కూడా చూసేందుకు రాని ఆ పిల్లలను చూస్తే అసలు వీళ్లు మనుషులేనా అన్న భావం కలగకమానదు.
ఇప్పుడు మనం చెప్పుకునే కథ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో చూసిన తల్లిదండ్రుల పట్ల మరీ ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అని అనుకోకుండా ఉండలేరు. కడుపున పుట్టిన పిల్లలు ఉన్నప్పటికీ ఆ వృద్ధుడికి అనాధగా అంత్యక్రియలు జరగడం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో వృద్ధ దంపతులు గొడుగు పోచయ్య, యాదవ్వ నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు యాదగిరి, రమేశ్, ఓ కుమార్తె ఉంది.
అయితే వృద్ధుడు పోచయ్య అనారోగ్యంతో కన్నుమూశాడు. విషయం తెలిసినప్పటికీ కన్న కొడుకులు కానీ, కుమార్తె కానీ రాలేదు. దీంతో భార్యే ముందుకు వచ్చి భర్త అంత్యక్రియలు చేసింది. అయినవారు అందరూ ఉన్నా కూడా అనాధగా రైతు వేదికలో పోచయ్య మృతదేహాన్ని పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది భార్య యాదవ్వ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రిని చివరి చూపు చూడకుండా, అంత్యక్రియలు కూడా చేయని కొడుకులు, కుమార్తెపై స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోయిన సైకో.. తల్లిదండ్రులపైనే
అగ్ని-6 పరీక్షకు భారత్ సిద్ధం...
Read Latest Telangana News And Telugu News