Share News

Warangal: అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు.. అడ్డొచ్చిన వదిన మృతి

ABN , Publish Date - Oct 16 , 2025 | 09:34 AM

వరంగల్‌ నల్లబెల్లి మండలం కొండాపురంలో గురువారం మరో దారుణం జరిగింది. అన్నపై తమ్ముడు ఘోరంగా కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన వదినపై సైతం కత్తితో దాడి చేశాడు. అన్న రమేశ్‌పై తమ్ముడు మేరుగుర్తి సురేశ్‌ కత్తితో దాడి చేశాడు.

Warangal: అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు.. అడ్డొచ్చిన వదిన మృతి
brother attack on elder brother

హైదరాబాద్, అక్టోబర్ 16: డబ్బుకోసం, ఆస్తుల కోసం దుర్మార్గులు ఎంత నీచానికైనా దిగజారుగుతున్నారు. రక్త సంబంధికులపైనే దాడులు చేస్తున్నారు. తప్పతాగి మద్యం మత్తులో క్షణికావేశంలో కుటుంబ సభ్యులనే హతమార్చుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో ఎక్కువగా అన్నతమ్ములు భూమి పంచాయతీ వివాదంలో ఈ దారుణాలు జరుగుతుండటం గమనార్హం.


తెలంగాణలోని వరంగల్‌ నల్లబెల్లి మండలం కొండాపురంలో గురువారం మరో దారుణం జరిగింది. అన్నపై తమ్ముడు ఘోరంగా కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన వదినపై సైతం కత్తితో దాడి చేశాడు. అన్న రమేశ్‌పై తమ్ముడు మేరుగుర్తి సురేశ్‌ కత్తితో దాడి చేశాడు. తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకోవడానికి వచ్చిన భార్యపై కూడా పాశవికంగా దాడికి దిగాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తుల వివాదం కారణంగానే అన్నా వదినలపై నిందితుడు దాడి చేసి ఉంటాడని భావిస్తున్నారు.

Updated Date - Oct 16 , 2025 | 09:43 AM