Share News

Hyderabad Psycho Attack: రెచ్చిపోయిన సైకో.. తల్లిదండ్రులపైనే

ABN , Publish Date - Oct 16 , 2025 | 09:25 AM

నిందితుడు రఘుపాల్ రెడ్డి ఓ లా కళాశాలలో ఎల్‌ఎల్బీ చదువుతున్నాడు. అయితే కొంతకాలంగా రఘుపాల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తున్నాడు.

Hyderabad Psycho Attack: రెచ్చిపోయిన సైకో.. తల్లిదండ్రులపైనే
Hyderabad Psycho Attack

హైదరాబాద్, అక్టోబర్ 16: నగరంలోని గండిపేట్‌లో దారుణం జరిగింది. ఓ సైకో కన్న తల్లిదండ్రులపైనే కత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు వచ్చి చూడగా ఇద్దరు కూడా రక్తపుమడుగులో పడి ఉన్నారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


గండిపేట ఈఐపీఎల్ అపేలా అపార్ట్మెంట్‌లో తల్లి భారతి, తండ్రి రవీందర్ రెడ్డి, కొడుకు రఘుపాల్ నివాసం ఉంటున్నారు. నిందితుడు రఘుపాల్ రెడ్డి ఓ లా కళాశాలలో ఎల్‌ఎల్బీ చదువుతున్నాడు. అయితే కొంతకాలంగా రఘుపాల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తున్నాడు. కొడుకు ప్రవర్తనతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో గత రాత్రి ఉన్నట్టుండి తల్లిదండ్రులపై రఘురామ్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తనకు ఏమి కాలేదని.. తల్లిదండ్రులు కావాలనే తనను మానసికంగా వేధిస్తున్నారంటూ రెచ్చిపోయి వారిపై దాడి చేశాడు రఘుపాల్.


విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. అయితే తనకు మతిస్థిమితం సరిగ్గా లేదని, తనకు వైద్యం చేయించాలని చూస్తున్నారని.. అందుకే దాడి చేసినట్లు పోలీసులకు చెప్పాడు సైకో. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

జగన్ విదేశీ పర్యటన.. కోర్టును ఆశ్రయించిన సీబీఐ

అగ్ని-6 పరీక్షకు భారత్‌ సిద్ధం...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 11:32 AM