Konda Murali: సీఎంతో మాకెలాంటి వైరుధ్యాలు లేవు: కొండా మురళి
ABN , Publish Date - Oct 16 , 2025 | 08:33 AM
సీఎం రేవంత్ రెడ్డితో తమకెలాంటి వైరుధ్యాలు లేవని కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. రేవంత్‌ను కొండా సురేఖ వైఎస్‌తో పోల్చారు అని చెప్పారు. మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకు తెలియదని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: సీఎం రేవంత్ రెడ్డితో తమకెలాంటి వైరుధ్యాలు లేవని కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. రేవంత్‌ను కొండా సురేఖ వైఎస్‌తో పోల్చారు అని చెప్పారు. మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకు తెలియదని చెప్పారు. కొండా సురేఖ ఛాంబర్‌కు తాను ఇప్పటివరకు పోలేదని వ్యాఖ్యానించారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారని.. ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన బిడ్డ, అల్లుడు లండన్‌లో ఉన్నారని.. అక్కడే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తన బిడ్డకు పదవి ఏమీ లేదని.. ఏ పార్టీలోనూ లేదని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ లోని గాయత్రి హిల్స్ లోని మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ఈ నేపథ్యంలో అతను మంత్రి ఇంట్లోనే ఉన్నాడనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సుమంత్ పై పలు ఫిర్యాదులు ఉండటంతో అరెస్ట్ చేసేందుకు వెళ్ళారు. పోలీసులు మఫ్టీలో వెళ్ళడంతో వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. మఫ్టీలో ఎందుకు వచ్చారు.. ఎవరు మీరు ప్రశ్నించారు. తాము పోలీసులమని, సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకే ఇలా వచ్చామని చెప్పారు. ఇంట్లోకి పోలీసులు వెళుతుండగా.. తాను ఇంట్లోకి అనుమతించనంటూ సుస్మిత అడ్డుకున్నారు.
అయితే కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను రోహిణ్‌రెడ్డి ఖండించారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ అప్పుడప్పుడు తన దగ్గరకు వచ్చేవారని చెప్పారు. తనకు డెక్కన్ సిమెంట్స్ అంశాన్ని సుమంత్ చెప్పారని.. తాను జోక్యం చేసుకోనని చెప్పి సుమంత్‌ను పంపేశానని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
Hyderabad Betting Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు విద్యార్థి బలి..
Flag a Bus Feature in TSRTC App: ఇకపై ఫోన్‌తో బస్సును ఆపేయొచ్చు!