Flag a Bus Feature in TSRTC App: ఇకపై ఫోన్‌తో బస్సును ఆపేయొచ్చు!
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:30 AM
ప్రజా రవాణాను మరింత సౌకర్యంగా మార్చేందుకు టీఎ్‌సఆర్టీసీ నిర్వహిస్తున్న ‘గమ్యం’ యాప్‌లో మహిళా ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులో....
మహిళల కోసం ఆర్టీసీ ’గమ్యం’ యాప్‌లో కొత్త సదుపాయం
హైదరాబాద్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రజా రవాణాను మరింత సౌకర్యంగా మార్చేందుకు టీఎ్‌సఆర్టీసీ నిర్వహిస్తున్న ‘గమ్యం’ యాప్‌లో మహిళా ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. యాప్‌లో ‘ఫ్లాగ్ ఏ బస్సు’ ఆప్షన్‌ను నొక్కడం వల్ల మహిళలు రోడ్డుపై ఆర్టీసీ బస్సు ను నిలిపి అందులో ప్రయాణించవచ్చు. అయితే ఈ సదుపాయం సాయంత్రం 7 నుంచి ఉదయం 5 గంటల మధ్య మాత్రమే అందుబాటులో ఉంటుంది. మహిళలు గమ్యం యాప్‌లో ‘ఫ్లాగ్ ఏ బస్సు’ ఆప్షన్‌ను నొక్కడంతో సెల్ ఫోన్ స్ర్కీన్ మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. సెల్‌ఫోన్ చేతిలో పట్టుకుని కదపడం వల్ల.. వారిని మహిళా ప్రయాణికులుగా గుర్తించి డ్రైవర్ వెంటనే బస్సు నిలుపుతారు.