Hyderabad Betting Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు విద్యార్థి బలి..
ABN , Publish Date - Oct 16 , 2025 | 08:03 AM
ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు అయిపోవచ్చు అనే ఆశతో.. యువత బెట్టింగ్ యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంట్లో ఉన్న డబ్బులు యాప్‌లో బెట్టింగ్ చేస్తూ.. అవి పోయాక అందినకాడికి అప్పులు చేసి యాప్‌లలో పెట్టి దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు.
హైదరాబాద్: భారత ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అయినా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన వ్యక్తులు వివిధ రూపాల్లో యాప్‌లలో బెట్టింగ్ చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు అయిపోవచ్చు అనే ఆశతో.. యువత బెట్టింగ్ యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంట్లో ఉన్న డబ్బులు యాప్‌లో బెట్టింగ్ చేస్తూ.. అవి పోయాక అందినకాడికి అప్పులు చేసి యాప్‌లలో పెట్టి దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు. ఉన్న డబ్బులు పోయి చేసిన అప్పులు తీర్చలేక అటు కుటుంబానికి చెప్పుకోలేక, ఇటు వాటిని తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినవారికి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జీడిమెట్ల పరిధిలో చోటుచేసుకుంది.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిరోజ్‌గూడలో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ విద్యార్థి ప్రాణాలు బలి కోరింది. ఆశిష్(22) అనే విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి ఆడుతూ వ్యసనపరుడయ్యాడు. బెట్టింగ్ వ్యవహరం తెలిసి తండ్రి శ్రీనివాస్ పలు మార్లు మందలించి అప్పులు తీర్చినా.. ఆశిష్ తన ప్రవర్తన మార్చుకో లేదు. మళ్లీ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొంటూ.. నిన్న(బుధవారం) రాత్రి ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆశిష్ ఉపయోగించిన బెట్టింగ్ యాప్‌లు, అతని ఆర్థిక లావాదేవీలు, , ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను పోలీసులు విచారిస్తున్నారు. ఆశిష్‌కు రుణాలు ఇచ్చిన వ్యక్తులు లేదా బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి ఏదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఆశిష్ బెట్టింగ్ యాప్‌లకు బానిసై, ఆర్థికంగా కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ , బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరిస్తున్నట్లు బాలానగర్ పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు
The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి