Share News

Transgenders Hospitalized: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు

ABN , Publish Date - Oct 16 , 2025 | 07:24 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ట్రాన్స్ జెండర్లు ఫినాయిల్ తాగిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. 25 మంది ట్రాన్స్‌జెండర్లు ఫినాయిల్ తాగి అస్వస్థతకు గురవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

Transgenders Hospitalized: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు
Transgender Hospitalized

భోపాల్, అక్టోబర్ 16: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ట్రాన్స్ జెండర్లు ఫినాయిల్ తాగిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. 25 మంది ట్రాన్స్‌జెండర్లు ఫినాయిల్ తాగి అస్వస్థతకు గురవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఓ అధికారి వివరాలు తెలిపారని జాతీయ మీడియా పేర్కొంది. మహారాజా యశ్వంతరావ్ హాస్పిటల్ (MYH) సూపరింటెండెంట్ ఇన్-చార్జి డాక్టర్ బసంత్ కుమార్ నింగ్వాల్ ఈ ఘటనపై స్పందించారు. సుమారు 25 మంది ట్రాన్స్‌జెండర్లు ఫినాయిల్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని.. వారికి చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు.

Updated Date - Oct 16 , 2025 | 10:25 AM