The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:46 AM
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన రక్షణశాఖ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు....
సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి
న్యూఢిల్లీ, అక్టోబరు 15: దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన రక్షణశాఖ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఆక్రమణలు జరిగిన ప్రాంతాలను సందర్శించి వివరాలు సేకరిస్తోందని వెల్లడించింది. భూముల స్వాధీనంలో కోర్టు స్టేలు, స్థానిక యంత్రాంగం సహకరించకపోవటం వంటి అంశాలు అడ్డంకిగా నిలుస్తున్నాయని.. దీనిని నివారించటానికి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. రక్షణశాఖ భూములను ఆక్రమణల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ కామన్‌కాజ్ అనే స్వచ్ఛందసంస్థ 2014లో దాఖలు చేసిన పిల్ మీద విచారణను సుప్రీంకోర్టు బుధవారం కొనసాగించింది. దేశంలో 75,629 ఎకరాల రక్షణశాఖ భూములు ఉండగా.. వాటిలో 4,418 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని రక్షణశాఖ ఈ ఏడాది జూలైలో కోర్టుకు సమర్పించిన నివేదికలో వివరించింది.