Share News

CBI: జగన్ విదేశీ పర్యటన.. కోర్టును ఆశ్రయించిన సీబీఐ

ABN , Publish Date - Oct 16 , 2025 | 08:13 AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై కోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఆయన నిబంధనలు ఉల్లంఘించారని కోర్టకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటన రద్దు చేయాలని కోరింది.

CBI: జగన్ విదేశీ పర్యటన.. కోర్టును ఆశ్రయించిన సీబీఐ

హైదరాబాద్, అక్టోబర్ 16: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై కోర్టును సీబీఐ ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్‌ తన సొంత సెల్ నెంబర్‌కు బదులు.. మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమో‌లో సీబీఐ స్పష్టం చేసింది. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది.


ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ కౌంటర్‌పై సీబీఐ కోర్టు ఈ రోజు అంటే.. గురువారం విచారణ చేపట్టనుంది.


ఇంతకీ ఏం జరిగిందంటే..

అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య.. 15 రోజుల పాటు ఐరోపా పర్యటనకు వెళ్తున్నాననీ.. అందుకు అనుమతించాలంట సీబీఐ కోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలను సమర్పించాలని షరతులు విధిస్తూ సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది.


అయితే కోర్టుకు వైఎస్ జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదని సీబీఐ పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో బెయిల్ షరతులను వైఎస్ జగన్ ఉల్లంఘించిన అంశాన్ని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకు వెళ్లింది. వేరే నెంబర్ కోర్టుకు సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.


దీంతో వైఎస్ జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ మెమోపై ఇటీవల న్యాయమూర్తి విచారణ చేపట్టారు. అందులో భాగంగా జగన్ తరఫు న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కౌంటర్‌పై ఈ రోజు విచారణ జరగనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. మద్యం తాగి స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి.. చివరకు..

అద్దేపల్లి అతి తెలివి

For More AP News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 08:33 AM