10th Class Student: దారుణం.. మద్యం తాగి స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి.. చివరకు..
ABN , Publish Date - Oct 16 , 2025 | 07:58 AM
మద్యం తాగి స్కూల్‌కు వచ్చిన విద్యార్థిపై ప్రధానోపాధ్యాయుడికి ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. ప్రధానోపాధ్యాయుడు.. అతడి మందలించాడు. ఆ క్రమంలో విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చే లోపు అతడు పాఠశాల ప్రహారీ గోడ దూకు పరారయ్యాడు. అతడి కోసం గాలించారు.
తిరుపతి, అక్టోబర్ 16: చంద్రగిరి మండలం కొంగరవారి పల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి విద్యార్థి పాఠశాలకు వచ్చాడు. ఆ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు.. ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించారు. ఆ విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు మందలించి.. అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చే లోపు అతడు పాఠశాల ప్రహారీ గోడ దూకి పారిపోయాడు.
అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు గాలించారు. చివరగా కొంగరవారి పల్లె వద్ద రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని కనుగోన్నారు. రైలు పట్టాలపై విద్యార్థి మరణించడంతో ఆర్‌పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే 18 ఏళ్లలోపు విద్యార్థులకు దుకాణాల వద్ద మద్యం విక్రయించడంపై నిషేధం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ విద్యార్థికి మద్యం బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లోని మద్యం దుకాణ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే అతడితో అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితులను ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ ఆనందం కోసమే కుట్రపూరిత ఆరోపణలు
For More AP News And Telugu News