CM Revanth Reddy on Medaram: గద్దెల ప్రాంగణానికి కొత్త శోభ.. మేడారం అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:51 PM
మేడారం సమ్మక్క - సారలమ్మ అమ్మవార్ల గద్దెల ప్రాంగణ నిర్మాణాన్నిరూ.236 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
హైదరాబాద్, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క - సారలమ్మ (Medaram Sammakka Saralamma) అమ్మవార్ల గద్దెల ప్రాంగణ నిర్మాణాన్ని రూ.236 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి ఇవాళ(మంగళవారం) విడుదల చేశారు. వంద రోజుల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, మహాజాతరలోపు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.236 కోట్లు ఖర్చుతో.. ఒకేసారి 10,000 మంది భక్తులు దర్శించుకునేలా నిర్మాణం చేపట్టనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికను మేడారంలో ప్రజల సమక్షంలో విడుదల చేశారు ముఖ్యమంత్రి.
🛕2026 జనవరి 28వ తేదీన సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి - కార్యాచరణ ప్రణాళికపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాలు, గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులతో మేడారంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు ముఖ్యమంత్రి.
🛕అనంతరం జరిగిన సభలో సమ్మక్క, సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణ ప్రణాళిక నమూనాను ఆవిష్కరించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పనులు పూర్తయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మేడారం జాతరకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వట్లేదు: సీఎం రేవంత్
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News And Telugu News